Breaking News: నకిలీ ఓటర్లకు కేంద్రం షాక్..!

Center shock to fake voters ..!

0
90

ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు వీలు కల్పించే ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టింది. ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నకిలీ ఓట్ల సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టనుంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు కోసం ఏడాదికి నాలుగు అవకాశాలు లభించనున్నాయి. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ ప్రాతిపదికన అప్లై చేసుకోవచ్చు.