రైతులకు గుడ్ న్యూస్..వెనక్కి తగ్గిన కేంద్రం

0
80

వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలనే అంశంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విషయంపై మొదటి నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా గత సంవత్సరం విద్యుత్ చట్ట సవరణ పేర్కొన్న ఆ నిబంధనలను తొలగించింది.

సాగు మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టి వ్యవసాయానికిచ్చే కరెంటును లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల డీలైసెన్సింగ్‌ నిబంధననూ పక్కన పెట్టింది. విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో గతేడాది రూపొందించిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది.

ఈ బిల్లు తొలి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సవరించిన విద్యుత్‌ బిల్లును ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని కేంద్ర విద్యుత్‌శాఖ కసరత్తు చేస్తోంది.