అమరావతి రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం….

అమరావతి రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్రం....

0
86

కేంద్రపాలిత ప్రాంతాలు అయిన దాద్రానగర్ హవేలీ డయ్యూనకు కలిపి డామన్ ను ఉమ్మడి పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తూ కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది… గత నెలలోనూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని జనవరి నుండి అమల్లోకి వస్తుందని కేంద్రం మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.

అయితే ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ అంశానికి ఎటువంటి సంబంధంలేదని తెలిపింది… అమరావతి అంశం పూర్తి రాష్ట్ర పరిధిలోని వ్యవహారమని కేంద్ర హోం శాఖ సహాయక శాఖమంత్రి కిశన్ రెడ్డి ఎంపీ జీవీఎల్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే…

రాజధానిగా అమరావతికే జై కొట్టిందనే వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది… ఈ నిర్ణయం కేవలం కేంద్ర పాలిత ప్రాంతపరిధిలో దాద్రా హవేలీ డయ్యూలకు మాత్రమే పరిమతం అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం..