కేంద్రం కొత్త స్కీమ్ ఏదైనా షాపుకి వెళ్లి బిల్లు తీసుకుంటే కోటి రూపాయల లాటరీ

కేంద్రం కొత్త స్కీమ్ ఏదైనా షాపుకి వెళ్లి బిల్లు తీసుకుంటే కోటి రూపాయల లాటరీ

0
38

చాలా మంది షాపులకి వెళ్లిన సమయంలో కొనే వస్తువుకి బిల్లు తీసుకోరు.. మరి కొందరు అయితే బిల్లు అక్కర్లేదు ట్యాక్స్ లేకుండా తగ్గించి ఇవ్వమంటారు, ఇలా చాలా మంది చాలా రకాలుగా పన్నులు ఎగ్గొడుతూ ఉంటారు, అయితే బిల్లు వద్దు అని భావించే వారు తీసుకోవడం ఎందుకు అనుకునేవారు ఇక ఆ పని చేయరు.

తాజాగా కేంద్రం జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకుంటోంది, ఇలాంటి ఆలోచన విరమించేలా నిర్ణయం తీసుకుంటోంది, అలాగే కొత్త విధానం తీసుకురానుంది.

కస్టమర్ కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకునేలా వినియోగదారుడ్ని ప్రోత్సహించడమే కేంద్రం ఉద్దేశం. జీఎస్టీతో బిల్లు తీసుకునే ప్రతి వినియోగదారుడు లాటరీలో పాలు పంచుకునేలా చేయనున్నారు. దీని కోసం ఓ వెబ్ సైట్ రూపొందిస్తారు, పలానా టైమ్ లో ఇది అప్ లోడ్ చేస్తే దానిని లాటరీ తీస్తారు.. అందులో గెలిస్తే 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఇచ్చే అవకాశం ఉంది ఇది కేంద్రం పరిశీలిస్తోందట.