కేంద్రం మీకు ఆఫర్ – ఈజీగా 50 వేల లోన్ ? మీరు ఇలా చేయాలి ?

కేంద్రం మీకు ఆఫర్ - ఈజీగా 50 వేల లోన్ ? మీరు ఇలా చేయాలి ?

0
81

కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సొంతంగా వ్యాపారం చేయాలి అని అనుకుంటే వారికి అనేక రకాల ప్రయోజనాలు రుణాలు కూడా ముద్రా బ్యాంకుల ద్వారా కల్పిస్తోంది, దేశంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల రుణాలు ఇలాగే అందించింది. అయితే ఈ లాక్ డౌన్ వేళ ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణంగా మారింది, అందుకే కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.

అయితే ఈ ప్రకటనలో శిశు ముద్ర రుణాలు ఒకటి. దానిపై కేంద్రం వడ్డీ 2 శాతం తగ్గింపు కూడా ప్రకటించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. మరి ఈ రుణం ఎలా పొందాలి ఇది ఎవరికి ఇస్తారు అనేది చూద్దాం, ఎవరైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని భావిస్తే వారికి ఈ రుణం అందిస్తారు.

ఇది ప్రధాన్ మంత్రి ముద్ర యోజనలో ఒక భాగం. పీఎం ముద్ర యోజన కింద మూడు రకాల రుణాలు ఉన్నాయి. అందులో శిశు ముద్ర లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అనే ముడు రకాల పథకాలున్నాయి.
మీరు వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటే ఈ శిశుముద్రా లోన్ చక్కగా సహయపడుతుంది.
మీకు 50 వేల రుణం అందిస్తారు… 2 శాతం సబ్సీడీ కూడా ఇస్తుంది కేంద్రం, ఇక దీనికి సంబంధించి కేంద్రం 1500 కోట్ల రుణం చెల్లిస్తోంది, మరి చిన్న వ్యాపారుల కోసం దీనిని ప్రశేవపెట్టారు, అన్నీ వాణిజ్య బ్యాంకుల్లో ఈ లోన్లు ఇస్తారు. మీరు వ్యాపారం ప్రారంభిస్తే ఇవి తీసుకోండి.