కేంద్రం నో రెస్పాండ్… అందుకే వారిని రంగంలోకి దింపిన జగన్

కేంద్రం నో రెస్పాండ్... అందుకే వారిని రంగంలోకి దింపిన జగన్

0
99

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు… అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని రాజధాని ప్రకటన రాకముందే చంద్రబాబు నాయుడు బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు.. అయితే దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో విచారణకు ఆదేశించారని తెలిపారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరామని అయితే స్పందిచకపోవడంతో జగన్ స్వయంగా సిట్ సీఐడీ విచారణకు ఆదేశించాల్సి వచ్చిందని అన్నారు…. అయితే టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పిటీషన్లు వేసి అడుగడుగునా అడ్డంపడుతున్నారని ఆరోపించారు…

ఎదుటివారు ఎంతటివారు అయిన ఢీ కొట్టే దమ్ము ధైర్యం జగన్ మోహన్ రెడ్డికి ఉందని అన్నారు… ఇక ముందు ఇలాంటి నాయకుడు వస్తాడో రాడో తెలియదని అన్నారు… జగన్ లాంటి నాయకుడు మరోకరు లేరని అన్నారు.. గతంలో తాను ఎన్టీఆర్ వద్ద పనిచేయలేకపోయానని వైఎస్ దగ్గర పని చేయలేకపోయానని అన్నారు…