ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్ట జమిలీ ఎన్నికల కోసం ఎదురు చూస్తుందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లకే పరిమితం అని కూడా ప్రచారం చేస్తోంది… ఈ కారణం వల్లనే సొంత పార్టీలో ఉన్న బిగ్ షాట్స్ ని వైసీపీ వైపు వెళ్లకుండా వ్యూహం పన్నుతోంది… అయిత ముందస్తు అంటే అది జగన్ చంద్రబాబు నాయుడులలో ఎవరికి లాభం అన్న దానిమీద చర్చ జరుగుతోంది..
నిజానికి అధికార వియోగం రోజు కూడా చంద్రబాబు నాయుడు భరించలేకపోతున్నారు… అందుకే ఆయన జగన్ తొందరగా గద్దే దిగాలనుకుంటున్నారు… ఏపీలో జమిలీ ఎన్నికలు వచ్చినా తిరిగి టీడీపీకే పట్టం కడతారన్న గ్యారెంటీ ఏంటన మరికొందరు తమ్ముళ్లు అంటున్నారు… పదే పదే జమిలీ ఎన్నికలు అని టీడీపీ నేతలు అని అంటున్నారు… అంటే ఎక్కడో పొగ ఉందన్న డౌట్లు అధికార పార్టీకి వస్తోందట…
ప్రస్తుతం మోదీ పొలిటికల్ గ్లామర్ ఢమాల్ అని పడిపోయిందని… దానికి తోడు కరోనా విషయంలో కేంద్రం నుంచి రూపాయి కూడా దేశ ప్రజలకు అందలేదని అంటున్నారు… 20 లక్షల కోట్లు ప్యాకేజి అనే చెప్పినప్పటికీ దాని డొల్లతనం బయటపడిందని చర్చించుకుంటున్నారు… అందుకే కేంద్రం కూడా జమిలీ ఎన్నికల వైపు చూస్తుందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు…