మరో పోరాటానిక సిద్దమైన చంద్రబాబు నాయుడు

మరో పోరాటానిక సిద్దమైన చంద్రబాబు నాయుడు

0
65

తెలుగుదేశం శాసనసభ్యులు అచ్చెన్నాయుడు ఏమయ్యారు? నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదని అన్నారు మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది? ఆయన్ను 100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారని ప్రశ్నించారు…

ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు.. ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం,అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుపై జగన్ కక్షగట్టి ఇలా కిడ్నాప్ చేయించడం దారుణం అని అన్నారు…ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు

దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగు బహీనవర్గాలవారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు..