టీడీపీపై మరో కేసు వేసిన ఆర్కే బాబుకి షాక్

టీడీపీపై మరో కేసు వేసిన ఆర్కే బాబుకి షాక్

0
94

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి నారాలోకేష్ ని సైతం ఓడించారు, ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై కేసులు విషయంలో ఆర్కే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఓటుకు నోటు కేసుని కూడా సుప్రీం కోర్టు వరకూ తీసుకువెళ్లిన నాయకుడు అనే చెప్పాలి.

అయితే చంద్రబాబు తాను సీనియర్ అని 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటారు.. కాని ఆయన మాత్రం ఈ ఎక్స్ పీరియన్స్ పై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి అన్నీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజావేదిక కావాలని టీడీపీ కోరింది. కాని దానిని అక్రమ కట్టడం అని కూల్చేశారు.

అయితే ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ భవన్ మాదిరిగానే ఏపీ రాజధాని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించింది.
దీనిపై ఇప్పుడు ఆర్కే కోర్టుకు వెళ్లారు. వివాదస్పద భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని దానిని వెంటనే తొలగించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్ట్లో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.