మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆయన సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పలువులు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు…
మాజీ జెడ్పీటీసీలు, బీసీ సెల్ ఉపాధ్యక్షలు జిల్లా ఉపాధ్యక్షులు వైసీపీలో చేరారు… కాగా ఎప్పటినుంచి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు… వైఎస్ హయాంలో కూడా ప్రయాత్నాలు చేశారు…
కానీ సక్సెస్ కాలేకపోయారు చంద్రబాబు… ఇక తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ జెండా ఊపాలని చూశారు కుదరలేదు… రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ సత్తా చాటినప్పటికీ చిత్తూరు జిల్లాలో సత్తాచాటలేక పోయింది… ఇక 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది…