చంద్రబాబుకు బిగ్ షాక్… సైకిల్ తొక్కలేక ఫ్యాన్ చెంతకు చేరిన తమ్ముళ్లు

చంద్రబాబుకు బిగ్ షాక్... సైకిల్ తొక్కలేక ఫ్యాన్ చెంతకు చేరిన తమ్ముళ్లు

0
150

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు సైకిల్ తొక్కలేక ఫ్యాన్ కిందకు చేరుతున్నారు… ఇప్పటికే చాలామంది ఫ్యాన్ చెంతకు చేరిన సంగతి తెలిసిందే…

తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మరి కొంత మంది టీడీపీని వీడి వైసీపీ తీర్థం తీసుకున్నారు… పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు… పార్టీ తీర్థం తీసుకున్న తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాదిపాలనలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేశారని, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది కోసం చేపట్లే కార్యక్రమాలపట్ల తాము ఆకర్షితులై వైసీపీలో చేరామని తెలిపారు…