లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించిన చంద్రబాబు.. చిల్లర రాజకీయాలు చేయొద్దు..!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించిన చంద్రబాబు.. చిల్లర రాజకీయాలు చేయొద్దు..!!

0
93

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇప్పటికే తెలంగాణ లో రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్ర లో రిలీజ్ కి నోచుకోలేదు.. గత కొన్ని రోజులనుంచి రిలీజ్ చేయాలనీ ట్రై చేసినప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ సినిమా ని రిలీజ్ చేయలేదు.. అయితే ప్రతుతం ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో సినిమా రిలీజ్ అయ్యింది.. అయితే తాజాగా జరిగిన సమావేశంలో ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సినిమా పై మొదటి సారి స్పందించారు.

ఈ సినిమాతో నన్ను ఏమో చేయాలనుకున్నారు.. కానీ నాకే మాత్రం ఆందోళన లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. లక్ష్మీ పార్వతి ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అని.. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు డైరెక్ట్‌గా లక్ష్మీ పార్వతి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. విజయవాడలో ఏం చేయలేడు అంటూ వర్మను హెచ్చరించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను తాను అడ్డుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.