ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూల్ జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ నేతలకు దైర్యాన్నినింపారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మనమే విజయం సాధిస్తామిన అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో టీడీపీ సుమారు 120 అసెంబ్లీ సీట్లను సాధిస్తుందని అన్నారు.
ప్రస్తుతం ఛానల్స్, అలాగే సోషల్ మీడియాలో వచ్చే పూకార్లను ఎవ్వరు నమ్మవద్దని పార్టీనేతలుకు చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. హరిత హోటల్లో 20 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కొండంత దైర్యాన్ని ఇచ్చినట్లు అయింది.
ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన అటునుంచి అటే కర్నాటకకు బయల్దేరారు. ఈ రోజు రాయ్ చూర్ లో జరుగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి అలాగే ప్రధాని మోడీ చేస్తున్నపరిపాలనపై నిప్పులు చెరుగనున్నారు.