ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది… ఈనెల 14 చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై దీక్ష చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ దీక్షకు అందరు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు… టీడీపీ నాయకుల మద్దతుగా జిల్లా కలెక్టరెట్ ముందు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు.. అయితే ఇప్పటికే ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు సంబంధించిన ఏర్పాటన్లు సిద్దం చేస్తున్నారు తమ్ముళ్తు…
తాజాగా దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్ మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది… అయితే ఈ దీక్షకు అధికారులు నిరాకరించారు… ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలను ఇక్కడ అనుమతి ఇవ్వమని తెలిపింది…