ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి సైలెంట్ గా తనపని తాను చేసుకుంటు వెళ్తున్నారు… ఇటీవలే వందరోజులు పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వందరోజుల పరిపాలనలో ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
కానీ వాటి గురించి మీడియా ముందు వివరించలేదు. పల్నాడులో చోటు చేసుకున్న ఇష్యు దగ్గర నుంచి ఇటీవలే కోడెల ఆత్మహత్య వరకు జగన్ స్పందించలేదు…. వీటిపై ప్రతిపక్ష నాయకులు నానా యాగి చేస్తున్నా కానీ జగన్ మాత్రం స్పందించకున్నారు.
ఇలానే జగన్ మౌనంగా కొనసాగితే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించకతప్పదని అంటున్నారు. అంతేకాదు ఇటీవలే గ్రామసచివలాయ పేపర్ లీక్ పై జగన్ స్పందించలేదు…..18 లక్షల కుటుంబాలు గ్రామ సచివలాయ ఉడ్యోద్యోగాలతో ముడిపడి ఉన్నందున వారిలో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు… జగన్ ఎన్ని పథాకాలు అమలు చేసినప్పటికి ఇలాంటి వాటిపై స్పందించకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.