ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అలాగే ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు విజయసాయిరెడ్డిలను కడిగిపారేశారు… మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో ఉన్నది ప్రభుత్వ ఫర్నీచర్ అయితే జగన్, విజయసాయిరెడ్డి ఇంట్లో ఉన్నది కూడా ప్రభుత్వ ఫర్నీచరే ని అని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు.
తాజాగా కోడెల ఆత్మహత్యపై విచారణ జరిపించాలని గవర్నర్ ను కలిసి 13 పేజీల నివేదికను అందజేశారు… ఈ నివేదికలో ప్రభుతం కోడెలపై పెట్టిన కేసులవల్లే ఆయన ఆత్మహత్యచేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు… ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు…
మంత్రులు స్పీకర్ చీఫ్ విప్ లకు ప్రభుత్వ ఫర్నీచర్ ఇస్తుందని పదవికాలం అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్రటరీ అవన్నీ ప్రభుత్వానికి సరెండ్ చేస్తారని అన్నారు.. గతంలో ఇదే పని కోడెల చేశారని అన్నారు. ఫర్నీచర్ తీసుకువెల్లమని కోడెల అధికారులకు లేఖ రాశారని కానీ దాన్ని అధికారలు పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు.