చంద్రబాబు ఫుల్ డిసైడ్… నోమోర్ ఆప్షన్….

చంద్రబాబు ఫుల్ డిసైడ్... నోమోర్ ఆప్షన్....

0
112

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఆయన విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబును ఉత్తరాంధ్రలో తిరగ నివ్వమని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడ ప్రజలతో మాట్లాడితే వైసీపీ నేతల బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు… తాను జనం కష్టాలు తెలిసిన వాడినని అన్నారు…

తనను ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగేదిలేదని అనుమతి తీసుకునే వచ్చానని చంద్రబాబు నాయుడు అన్నారు… పోలీస్ అధికారులు ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు… ప్రశాంతమైన విశాఖలో వైసీపీ నేతలు అలజడి పుట్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు…