పవన్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు…

పవన్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు...

0
83

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు… రాష్ట్రంలో ఇసుక లభ్యత లేక ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిలిచారు పవన్..

వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తు విశాఖ జిల్లాలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు… ఈ లాంగ్ మార్చ్ కు ప్రతిక్ష పార్టీలన్ని మద్దతు ఇవ్వాలని పవన్ ఇటీవలే కోరారు… ఈ మేరకు చంద్రబాబు నాయకుడు ఫోన్ చేసి లాంగ్ మార్చ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు…

ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఫోన్ చేసి మద్దతు తెలపాలని కోరారు… ప్రజలకు మంచి చేసే ప్రతీ కార్యక్రమంలో తమ పార్టీ తరపున మద్దతు ఎప్పుడు ఉంటుందని చంద్రబాబు నాయుడు పవన్ కు ఫోన్ లో చెప్పినట్లు తెలుస్తోంది…