చంద్రబాబు గురించి సీక్రెట్ బయటపెట్టిన సుజనాచౌదరి

చంద్రబాబు గురించి సీక్రెట్ బయటపెట్టిన సుజనాచౌదరి

0
88

చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా రాజకీయాల్లో మెలిగి అలాగే రాజ్యసభకు ఎన్నిక అయిన వ్యక్తి ఎంపీ సుజనా చౌదరి, అలాగే బాబు దగ్గర రాజకీయంగా ఎదిగిన నేత సుజనా చౌదరి.. ఆయనకి కేంద్రంలో మంత్రి పదవి కూడా వచ్చేలా బాబు సహకరించారు. అయితే చివరకు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమితో ఆయన బీజేపీలో చేరిపోయారు.

తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు తనకు నచ్చలేదని అన్నారు. ఆ సమయంలో ముఖ్యంగా 2017 లో రాజకీయాలకు గుడ్ బై చెబుదామని డిసైడ్ అయ్యాను అని తెలిపారు సుజనా చౌదరి.

పార్టీ గురించి ఆలోచించి వెనక్కి తగ్గి పార్టీ నష్టపోకుండా కొనసాగాను అని చెప్పారు, ఇక ఎన్నికల సమయంలో ముందుగానే నేను బీజేపీలో చేరి ఉంటే సరిపోయేది, కాని ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలి అని ఓ నేత సలహాతో ఆగిపోయాను అని చెప్పారు సుజనా చౌదరి… తాను బీజేపీలోకే వెళ్లడానికి కారణం అరుణ్ జైట్లీ అని, ఆయన ఆహ్వానం తో బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని ఎంపీ వెల్లడించారు. కాని బయట చంద్రబాబు వల్లే తాను బీజేపీలో చేరాను అని ప్రచారం చేస్తున్నారు అది ఎంత వరకూ కరెక్ట్ కాదు అని చెప్పారు సుజనా చౌదరి.