28న చంద్రబాబు మరో కీలక అడుగు

28న చంద్రబాబు మరో కీలక అడుగు

0
36

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ అధికార పార్టీ వైసీపీని చెణుగుడు ఆడుతున్నారు, తాజాగా ఆయన ఈనెల 28 న మరో కీలక స్టెప్ వేయనున్నారు రాజకీయంగా.

ఈ నెల 28వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు బాబుగారు. అమరావతిలో తమ ప్రభుత్వం ఉండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, దాదాపుగా పూర్తయ్యే స్థాయిలో ఉన్న నిర్మాణాలను సందర్శించనున్నారు. కావాలనే వైసీపీ వీటిని ఆపింది అని తెలుగుదేశం గుర్తించింది.

రాజధానిపై అనేక ప్రకటనలు ఇస్తూ ప్రజల్లో వ్యాపారుల్లో కొత్త భయాలను క్రియేట్ చేశారు వైసీపీ నేతలు.. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు రైతులతో మాట్లాడి సరికొత్త స్ట్రోక్ వైసీపీకి ఇవ్వనున్నారు. మరో పక్క అక్కడ కొందరు రైతులు చంద్రబాబు వల్ల తాము నష్టపోయాము అని చెబుతున్నారు, కాని ఇదంతా వైసీపీ కుట్ర అని , కొందరి చేత కావాలనే ఇలాంటి ప్రకటనలు ఆరోపణలు చేయిస్తున్నారు అని టీడీపీ నేతలు వారి విమర్శలను కొట్టిపారేస్తున్నారు.