2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుండి చాలామందితమ్ముళ్లు పెద్దగా యాక్టివ్ గా కనిపించకున్నారు… ముఖ్యంగా పేరు మొసిన నేతలు సైతం ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు… ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…
టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి ఎన్టీఆర్ నాటి నుంచి 2014 ఎన్నికల వరకు విశాఖ జిల్లా టీడీపీకీ కంచుకోట… అయితే 2019 ఎన్నికల్లో జగన్ ఆ గంచుకోటను బద్దలు కొట్టారు… విశాఖలో వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని హిస్టరీ తిరగరాసింది…
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన తమ్ముళ్లు ఇంటికే పరిమితం అయ్యారు… ఒక వైపు ఇదే జిల్లాలో పార్టీ అధిష్టానం సైకిల్ ను పరుగులు పెట్టించాలని చూస్తుంటే తమ్ముళ్ళు మాత్రం ఇందుకు ససేమిరీ అంటున్నారు.. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి…
—