చంద్రబాబు మూడు సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా చేశారు.. అనుభవం అందరిలో కంటే ఆయనకే పరిపాలనలో ఉంది అంటున్నారు అందరూ, అయితే ఈ మధ్య జగన్ సర్కారు తప్పులు చంద్రబాబు ఎత్తి చూపిస్తున్నారు. దీనిని కొంత మంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
అనంతపురం మాజీ ఎంపీ, రాజకీయాల్లో సీనియర్ అయిన జేసీ దివాకర్రెడ్డి అయితే ఈ అంశాన్ని చంద్రబాబు ముందే నిర్మొహమాటంగా చెప్పేశారు అని తెలుస్తోంది.
తాజాగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి జేసీ వచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబుతో అరగంటసేపు సమావేశమయ్యారు. తప్పులు ఎక్కువ చేయనివ్వండి. మీరెందుకు తొందరపడి చెబుతున్నారు? ఎన్ని తప్పులు చేస్తే అన్నీ చేయనివ్వండి. ఓటేసిన ప్రజలక్కూడా నొప్పి తెలియాలి కదా అని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట. తాజాగా ఈ విషయాన్ని ఓ ప్రముఖ మీడియా తెలియచేసింది. దీనిపై బాబు మధ్య జేసీ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట.
ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ తనయులు ఇద్దరూ ఓటమి పాలయ్యారు, దీంతో పార్టీ తరపున తనయులు మాత్రమే యాక్టీవ్ గా ఉంటున్నారు.
అయితే గ్రామాలలో కూడా కక్షపూరిత రాజకీయాలు కొనగుతున్నాయి. ప్యాక్షన్ ఉండే గ్రామాల్లో తెలుగుదేశం వర్గాలు ఉండలేకపోతున్నాయి జనాలకు అన్నీ తెలుస్తున్నాయి అని అన్నారట జేసీ.. జగన్ చేసే తప్పులు చెప్పకండి అని బాబుకి జేసీ సలహా ఇచ్చారు అని తెలుస్తోంది.