చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి మాజీ మంత్రి నారాయణ….

చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి మాజీ మంత్రి నారాయణ....

0
73

ఏపీలో కరోనా పంజా విసురుతుంటే మరోవైపు అదే జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి… తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు కేసులకు నిరసనలు ఆందోళనలు అసెంబ్లీ సమావేశాలు… నేతల వలసలు ఇలా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ఇప్పటికే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీసే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కీలక నేతలను చేర్చుకుంటోంది అధికార వైసీపీ…

ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే చాలా మంది వైసీపీ గూటికి చేరిపోయారు… తాజాగా ఓ మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది… అయితే ఆయనను పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… మాజీ మంత్రి నారాయణ వైసీపీ తీర్ధం తీసుకునేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… త్వరలో ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోవడం ఖాయమని అంటూ వార్తలు వస్తున్నాయి…

అయితే ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీకి కలిసి వస్తుందని కానీ నారాయణ విషయంలో వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు… కాగా 2014 ఎన్నికల తర్వాత టీడీపీ తీర్ధం తీసుకుని ఎమ్మెల్సీ ద్వారా ఆయన మంత్రి అయ్యారు.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి చెందారు…