చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. టీడీపీలో చేరి తప్పు చేశా.. ఇక గుడ్ బై…

చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. టీడీపీలో చేరి తప్పు చేశా.. ఇక గుడ్ బై...

0
111

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వరుస షాక్ లు తగులుతున్నాయి… ఇప్పటికే చాలామంది కీలక నేతలు టీడీపీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… ఇక ఇదే క్రమంలో టీడీపీ మాజీ ఎంపీ టాలీవుడ్ ప్రముఖ నటుడు మురళీ మోహన్ చంద్రబాబు కు షాక్ ఇచ్చారు…

తన జీవితంలో చేసిన అతిపెద్ద పెద్ద తప్పు తాను రాజకీయాల్లోకి రావడమే అని అన్నారు… తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు నాయుడు గతంలో కన్విన్స్ చేసి టీడీపీలో చేర్చుకున్నారని అన్నారు… తన పదేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయం అంటే విరక్తి వచ్చేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఇక రాజకీయాలు చేయలేనని గుడ్ బై చెప్పి వచ్చానని అన్నారు.. కాగా 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మురళీ మోహన్ 2014 ఎన్నికల్లో అదే సెగ్మెంట్ నుంచి పోటీచేసి గెలిచారు.. ఇక 2019 ఎన్నికల్లో పోటీ దూరంగా ఉన్నారు… పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు..