చంద్రబాబుకు షాక్…. టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

చంద్రబాబుకు షాక్.... టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్

0
97

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే చాలామంది మాజీలు వైసీపీలో చేరిపోగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి రెబల్ గా మారిపోయారు…

ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ఇక ఈ వార్తలు ప్రజలు మరువక ముందే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ఆయన పార్టీలో చేరే విషయమై మార్టూరులో తన అనుచరులతో సమావేశం అయి తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు….

అయితే ఆయన వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అనుచరులు… అంతేకాదు కొద్దికాలంగా సాంబశివరావు గురించి వార్తలు వచ్చినా కూడా ఆయన ఖండించలేదు దీంతో ఆయన పార్టీలో చేరడం ఖయమైందని చర్చించుకుంటున్నారు… మరి చంద్రబాబు నాయుడు ఆయన వైసీపీలో చేరకుండా ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి…