చంద్రబాబుకు ఆ బీజేపీ నేత అమ్ముడు పోయారా

చంద్రబాబుకు ఆ బీజేపీ నేత అమ్ముడు పోయారా

0
87

నిన్నటి వరకు టెస్టులు చేయడం లేదు. కోవిడ్ ను దాచిపెడుతున్నారని ఏడ్చిన వ్యక్తి, ఇప్పుడు ఎవరినడిగి దక్షిణ కొరియా నుంచి టెస్ట్ కిట్లు కొన్నారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు..

ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వం ఏ పని చేయకూదా అని విజయసాయిరెడ్డి ఆరోపించారు… మరణాలు పెరిగితే శవ రాజకీయాలు చేయొచ్చని ఆరాటం పడుతున్నారని అరోపించారు..

అలాగే దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం అని అన్నారు. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుందని అన్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలని అన్నారు..