చంద్రబాబుకు వైసీపీ న్యూ ఇయర్ సవాల్

చంద్రబాబుకు వైసీపీ న్యూ ఇయర్ సవాల్

0
97

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు వ్యవహారంపై ప్రతిపక్షాలుపై అధికార నాయకులు అధికార నాయకులపై ప్రతపక్ష నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు… తాజాగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దమ్ముంటే చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు…

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు స్వాగతిస్తున్నారని కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందటం చంద్రబాబుకు ఇష్టంలేదని వెంకటరామి రెడ్డి ఆరోపించారు….