చంద్రబాబు, లోకేశ్ ఏపీ ప్రజలకు విసెష్

చంద్రబాబు, లోకేశ్ ఏపీ ప్రజలకు విసెష్

0
97

71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు ఎమ్మెల్సీ లోకేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు…

లోకేశ్ ట్వీట్…

దేశప్రజలందరికీ స్వేఛ్చ,సమానత్వాలను అందించడానికి మహనీయులు రూపొందించిన రాజ్యాంగానికి సమర్థుల పాలనలోనే పరిపూర్ణత చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొనిఉన్న ప్రజాస్వామ్య సంక్షోభాన్ని రాజ్యాంగమే సరిదిద్దగలదని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని అన్నారు..

చంద్రబాబు నాయుడు ట్వీట్

రాజ్యాంగానికి న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలని తెలిపారు. ఏ పాలనలో అయినా ప్రజలకు ఇవి అందని నాడు మహనీయుల త్యాగాలకు అర్థంలేదని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులే అమరావతి విషయంలో రాష్ట్రప్రజలకు న్యాయంచేస్తాయని విశ్వసిస్తూ, ప్రజలందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని తెలిపారు