మా కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదు: చంద్రబాబునాయుడు

మా కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదు: చంద్రబాబునాయుడు

0
96

గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి పనులు చేస్తామని వైసీపీ చెప్పిందని, ఆ పనులు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేస్తే, తాము కూడా ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నామని అన్నారు.

వైసీపీ తమ కార్యకర్తలపై దాడులు చేయడం మంచిది కాదని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, తమకు అరవై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, తాము ఎక్కడా దౌర్జన్యం చేయడం లేదని, అలా చేయడం తమకు చేతకాదని అన్నారు.

అధికారంలో ఉండటం, అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదని అన్నారు. ముప్పై ఏడు సంవత్సరాలుగా టీడీజీ జెండాను తమ కార్యకర్తలు మోస్తున్నారని, వారిని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరోసారి హామీ ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజల ప్రాణాలకు, వారి ఆస్తులకు అన్ని విధాల భరోసా కల్పించాలని ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.