2020లో చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తి విలువ ఎంత పెరిగిందో తెలుసా…

2020లో చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తి విలువ ఎంత పెరిగిందో తెలుసా...

0
131

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ తమ కుటుంబం ఆస్తులను ప్రకటించారు… తన తల్లి నారా భువనేశ్వరి 23 సంవత్సరాలుగా హెరిటేజ్ సంస్ధలో పని చేస్తున్నారని ఈ సంస్థ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాది లభిస్తోందని అన్నారు… తాజాగా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ తమ ఆస్తి వివరాలను వెళ్లడించారు…

మొత్తం ఆస్తులు 119.42 కోట్లు ఉండగా అప్పులు 26.04 కోట్లు ఉన్నట్లు తెలిపారు… ఆస్తుల్లో నుంచి అప్పులను మినహాయించగా నికర ఆస్తుల విలువు 93.38 కోట్లని తెలిపారు… గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 85 లక్షలు పెరిగాయని తెలిపారు…

ఇక చంద్రబాబు నాయుడు ఆస్తి 3.87 కోట్లు అందులో అప్పులు 5.13 ఉన్నాయని తెలిపారు… భువనేశ్వరి ఆస్తి 53 కోట్లు నుంచి 50 కోట్లకు తగ్గిందని చెప్పారు… లోకేశ్ ఆస్తి 24 కోట్లు కాగా బ్రాహ్మణి ఆస్తి 15 కోట్లా 68 లక్షలు… దేవాన్ష్ ఆస్తి 19.42 లక్షలు ఉన్నాయని తెలిపారు… ప్రతీ సంవత్సరం తమ ఆస్తి విలువలను ప్రకటిస్తున్నామని తెలిపారు…