టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వ్యూహం ఎవ్వరికి అంతుబట్టకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత మౌనంగా ఉంటూ వచ్చారు గంటా… అంతేకాదు ఆ మధ్య కాలంలో గంటా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ లేదంటే వేసీపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి… కానీ ఇంతవరకు చేరలేదు…
అయితే తాజాగా బీజేపీ నుంచి వందమంది చోటా మోటా నాయకులను టీడీపీలోకి జాయి చేయించే ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు గంటా… దీంతో అందరు ఆయన వ్యూహం ఏంటని చర్చించుకుంటున్నారు… ఇప్పుడిప్పుడే బీజేపీ రాష్ట్రంలో పుంజుకోవాలని చూస్తోంది.. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి…
ఇక ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది… వాస్తవానికి ఈ నిర్ణయం గంటా స్వయంగా తీసుకున్నారని బీజేపీ పెద్దలు భావించకున్నారు… వంద మంది బీజేపీ కార్యకర్తలను పార్టీ చేర్చుకునే క్రమంలో ఈ విషయాన్ని చంద్రబాబుకు చేరవేసే ఉంటారని అంటున్నారు… బాబు కనుసన్నల్లో ఇదంతా జరిగి ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు… రాష్ట్రంలో బీజేపీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని కమలం నాధులు భావిస్తున్నారు…