ఆనందంతో ట్వీట్ చేసిన చంద్రబాబు

ఆనందంతో ట్వీట్ చేసిన చంద్రబాబు

0
95

తాను హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకల్లో పూరీ పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామివారితో కలిసి పాల్గొన్నానని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

పరమ శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఆనంద దాయకం అని చంద్రబాబు నాయుడు అన్నారు…

అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం. కార్తీకమాసం అనగానే శివార్చన, అభిషేకాలు మాదిరిగానే కోటి దీపోత్సవం గుర్తొచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయం తెలిపారు…