చంద్రబాబు వారిద్దరికి ఎలాంటి హామీ ఇస్తారు…

చంద్రబాబు వారిద్దరికి ఎలాంటి హామీ ఇస్తారు...

0
95

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు… అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్పితే క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు…

అయితే ప్రస్తుతం టీడీపీ తరపున ఇద్దరు నేతలు మాత్రం తమ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు అందులో ఒక రాజేంద్ర ప్రసాద్… అలాగే బుద్దా వెంకన్న… ప్రస్తుతం వీరిద్దరు టీడీపీ తరపున ఎమ్మెల్సీలు గా ఉన్నారు… వీరిద్దరికి ప్రజా బలం లేకున్నా మీడియా వేధికగా చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు… ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు…

దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి… అయితే ఒక వేల శాసన మండలి రద్దు అయితే టీడీపీలో చాలామంది నాయకులు నష్టపోయే అవకాశం ఉంది… వీరిలో రాజేంద్ర ప్రసాద్… అలాగే బుద్దా వెంకన్న కీలకంగా కనిపిస్తున్నారు… మరి వీరికి చంద్రబాబు ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి… కాగా గత ఎన్నికల్లో పెనుమలూరు నియోజకరవ్గంలో పోటీ చేసి విజయం సాధించాలని చూసిన రాజేంద్ర ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వలేదు…