నెక్ట్స్ చంద్రబాబు జైలుకేనా….

నెక్ట్స్ చంద్రబాబు జైలుకేనా....

0
104

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో జైలుకు వెళ్లనున్నారా…. అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అధికారం లేదని రామచంద్రయ్య అన్నారు..

ఓటుకు నోట్ల కేసులో ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం అని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చట్టాన్ని చేతిలో పెట్టుకుని పాలించారని ఆయన మండిపడ్డారు. అలాగే వ్యాపార లావాదేవీలను చక్కదిద్దుకునే సుజనా చౌదరి కూడా జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు.