ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు కుదిరితే ఫ్యాన్ కిందకు లేదంటే కమలం చెంతకు చేరిపోయేందుకు ట్రై చేస్తున్నారు.. ఇప్పటికే చాలామంది తమ్ముళ్లు టీడీపీకి టాటా చెప్పిన సంగతి తెలిసిందే…
ఇక తాజాగా మరో కీలక నేత సైకిల్ దిగేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరాలని చూస్తున్నారట… గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన ఆ మాజీ ఎమ్మెల్యే పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు… 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి చెందారు
ఆతర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో మళ్లీ కాంగ్రెస్ నేతగా మారారు ఇక తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆయన వైసీపీ తీర్థం తీసుకుని 2014లో పోటీ చేసి ఓటమి చెందారు… అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీ తీర్థం తీసుకున్నారు… కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ దక్కలేదు… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట….