తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడవ కన్ను తెరిస్తే చంద్రబాబు నాయుడు భస్మమైపోతారని అన్నారు…
తాజాగా ఆయన కర్నూల్ జిల్లాలో పర్యటించారు… అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు… అంతేకాదు చంద్రబాబుకు సవాల్ కూడా విసిరారు… ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వదిలి మరో కొత్త పార్టీని స్థాపించి పోటీకి రావాలని మంత్రి అనిల్ సవాల్ విసిరారు…
చంద్రబాబు నాయుడు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులని అన్నారు… ఎన్టీఆర్ అభిమానంతో టీడీపీకి ఓట్లు పడుతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు చూసి కాదని అన్నారు… ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు దుసుకుపోతుందని అన్నారు…