కియా కంపెనీపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
రాష్ట్రంలో ఇంచుకూడా అభివృద్ది జరుగకూడదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు… కియా గురించి రాసిన కథనం రైటర్స్ పై ఏవింగా చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తున్నామని తెలిపారు.. ప్రజల వద్దకే వైసీపీ ప్రభుత్వం పరిపాలన తీసుకు వెళ్తుందని అన్నారు…
దీన్ని ఏ విధంగా టీడీపీ నాయకులు అడ్డుపడదామా అని ఆలోచిస్తున్నారని ఆరోపించారు.. కియా కంపెనీ ఎక్కడకు తరలిపోదని అన్నారు… టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తుందని బొత్స అన్నారు…