చంద్రబాబు నాయుడును రిక్వస్ట్ చేస్తున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్…

చంద్రబాబు నాయుడును రిక్వస్ట్ చేస్తున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్...

0
105

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రిక్వస్ట్ చేశారు… ఇప్పటివరకు రాయలసీమ చాలా నష్టపోయిందని అన్నారు.. సీమ అభివృద్దికి నష్టం కలిగించొద్దని టీడీపీని రిక్వస్ట్ చేశారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మూడు రాజధానులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు కొడుకుల్లా చూసుకుంటారని అది ఆయన బాధ్యత అని గోరంట్ల మాధవ్ అన్నారు…

అందుకే రాయలసీమను అభివృద్ది పదంలో తీసుకెళ్లాలని తాను జగన్ కోరుతున్నట్లు చెప్పారు… అలాగే చంద్రబాబుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు… రాజధాని అమరావతిపై చంద్రబాబు నాయుడు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆయన్ను ఎవ్వరూ నమ్మరని అన్నారు…