కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు కీలక నిర్ణయం

కోడెల ఆత్మహత్యపై చంద్రబాబు కీలక నిర్ణయం

0
101

మాజీ టీడీపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణ వార్తను ఆపార్టీనాయకులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు… ఆయన మరణం పార్టీకి తీరని లోటుగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు… ఈ నేపథ్యంలో ఆయన మరోకీలక నిర్ణయం తీసుకున్నారు…

పార్టీ నాయకులతో కలిసి రెపు చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నారు.. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరనున్నారు.. కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వం తమ నాయకులనే టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అందుతోంది…

ఇదే విషయమై రేపు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఎంపీలు హాజరు కానున్నారు.