అధికార పార్టీకి షాక్ … చంద్రబాబు అదిరిపోయే ప్లాన్

అధికార పార్టీకి షాక్ ... చంద్రబాబు అదిరిపోయే ప్లాన్

0
84

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఈమేరకు దృష్టి సారించగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై కూడా దృష్టి సారించారు. ఈమేరకు ఆయన ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు…

ఎన్నికలనాటికల్లా రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు… ఇక నుంచి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరికి అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు… అంతేకాదు పార్టీని బలోపేతం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అది తన ఆదీనంలో పనిచేస్తుందని బాబు స్పష్టం చేశారు.

అవసరాలకోసం పార్టీ మారినా కార్యకర్తలు అలాగే ఉన్నారని అన్నారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యం అని అన్నారు. గతంలో పార్టీ మారిన నాయకులు ఏది శాశ్వితం కాదని హెచ్చరించారు… ప్రజలు ఎవ్వరు అధైర్యపడవద్దని ఇక నుంచి క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం స్టార్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు.