చంద్ర‌బాబును క‌లిసిన ప‌వ‌న్ ఎందుకో తెలుసా ?

చంద్ర‌బాబును క‌లిసిన ప‌వ‌న్ ఎందుకో తెలుసా ?

0
109

రాజ‌కీయాల్లో బ‌ద్ద‌శ‌త్రువులు ఉండ‌రు బ‌ద్ద మిత్రులు ఉండ‌రు… అవ‌స‌రాన్ని బ‌ట్టి పార్టీలు మారుతూ ఒక‌రికొక‌రు క‌లిసిపోతుంటారు… అయితే ఇప్పుడు ఇదే పని ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేశారు.

ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్ద‌రు ఒక‌రికొక‌రు ఎదురు ప‌డి చిరున‌వ్వుతో ప‌లుక‌రించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ రోజు ఉద‌యం తెలుగు ఛాన‌ల్స్ కు రారాజు అయిన‌టువంటి రామోజీరావు మ‌న‌వ‌రాలు కీర్తి సోహాన వివాహం సంద‌ర్భంగా వీరిద్ద‌రు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఒక‌రికొక‌రు ఎదురుప‌డి న‌వ్వుకున్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు శ్రీవారి ప్ర‌సాదాల‌ను బ‌హుమ‌తిగా అందించారు. గ‌తంలో వీరిద్ద‌రు అమ‌రావ‌తి ప్రాతంలో జ‌రిగిన ఓ ఆల‌య విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌లో క‌లుసుకున్నారు. ఆ త‌ర్వానుంచి ఎప్పుడు వీరిద్ద‌రు క‌లుసుకోలేదు. అయితే ఈ రోజు కీర్తి సోహాన వివాహం సంద‌ర్భంగా వీరిద్ద‌రు క‌లుసుకున్నారు.