చంద్రబాబుపై వంశీ యాక్షన్… జేసీ రియాక్షన్

చంద్రబాబుపై వంశీ యాక్షన్... జేసీ రియాక్షన్

0
45

తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… తాజాగా ఈ రాజీనామా ఆమోదించి వంశీని చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు.. దీనిపై వంశీ కౌంటర్ ఇచ్చారు… చంద్రబాబు నన్ను సస్పెండ్ చేశారు… తన భవిష్యత్ చూసుకోవాలి ఫస్ట్ అని అన్నారు…

ఆయన ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిదని వ్యాఖ్యానించారు… టీడీపీపై ప్రజల విశ్వసం పోతుందని అన్నారు… చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని వంశీ చేసిన వ్యాఖ్యలపై జేసీ స్పందించారు…

పార్టీ మారేవారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు జేసీ… కొన్నినెలల క్రితం సుజనా కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారని అన్నారు… పార్టీ మారేవారందరు వేదింపులకు భయపడి ఇత పార్టీల్లోకి జంప్ చేస్తున్నారని అన్నారు… జగస్ ప్రతీకార కోరిక ఎక్కువ అయిందని అన్నారు… అధికారం శాశ్వితం కాదని గ్రహించాలని తెలిపారు జేసీ