చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్

0
70

అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదైనా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి ఇన్ సైడర్ ట్రేడింగుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.. అది ఆయన పేటెంట్ అని మండిపడ్డారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు

రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు నాయుడు
బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగన్ ఆకాంక్ష అని అన్నారు

అలాగే కడప స్టీల్ ప్లాంటు విషయంలో చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలకోరుగా నిల్చారని ఆరోపించారు. ఇనుప ఖనిజం సరఫరా హామీ లేకుండానే ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేశారని మండిపడ్డారు.అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే NMDCతో ఏటా 50 లక్షల టన్నుల ఖనిజం సరఫరాకు ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. జగన్ కు మోసకారి బాబుకు తేడా ఇదే అని విజయసాయిరెడ్డి అన్నారు.