చంద్రబాబుపై విజయసాయిరెడ్డి న్యూ కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి న్యూ కామెంట్స్

0
95

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా అని చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు…

భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమాఅని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా అని అన్నారు 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ అన్నారు…

పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడు కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయిందని అన్నారు. పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు…