చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
88

హైదరాబాద్ లో ఉండి పోలీసు పాస్ తీసుకుని అక్కడి పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చుగదా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు…

ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నందుకైనా చంద్రబాబు నాయుడు కొంత బాధ్యత తీసుకోవాలని అన్నారు

పనీపాట లేకపోవడమో, మీడియాలో కనిపించాలనే ప్రచారం పిచ్చి వల్లనో…లాక్ డౌన్ సమయంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరపడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. మీరు వాళ్లకు ఏం టాస్క్ ఇచ్చారు? ఈ సమయంలో వాళ్లు ఏం చేయగలరో ఆలోచించారా? దేశంలో ఎక్కడా ఇటువంటి వింతలు కనిపించవని అన్నారు…