పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని చంద్రబాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేదని అన్నారు. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అలాగే కియా పరిశ్రమ తరలిపోతోందని గుండెలు బాదుకునోళ్లు ఇప్పుడు సిగ్గుతో బిగుసుకు పోయారు. అప్పట్లో సంస్థ ప్రతినిధులు ఖండించినా ఎల్లో మీడియా బోగస్ వార్తల దాడి కొనసాగించింది. సీఎం జగన్ సమక్షంలో కియా 400 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించేటప్పటికి నోళ్లు పెగలడం లేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
నిత్యం ఏదో ఒక సంక్షోభంలో కొట్టుమిట్టాడే వ్యవసాయ రంగానికి సీఎం జగన్ పెద్ద పీట వేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు ఇప్పుడు కొత్తగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం దేశంలోనే మొదటిసారి. గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని రకాల సహాయాలు, సూచనలు అందుబాటులోకి వస్తాయిని అన్నారు..