ఈ ఆరుగురిని రక్షించేందుకు చంద్రబాబు భారీ ప్లాన్

ఈ ఆరుగురిని రక్షించేందుకు చంద్రబాబు భారీ ప్లాన్

0
87

నారాయణ, చింతమనేనిన, సూజనా యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకు చంద్రబాబునాయుడు ఈ డ్రామాకు తెర తీశారని విజయసాయిరెడ్డి అరోపించారు.. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు నాయుడుదొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టిందని ఆరోపించారు.. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉందని అన్నారు. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు శాపాలు ఎందుకని ప్రశ్నించారు.