ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యం… ప్రజలే దేవుళ్లు వారిని కాపాడుకునేందుకు నా ప్రాణం అయినా ఇస్తానని చంద్రబాబు నాయుడు నిత్యం చెబుతారు… అందుకు తగ్గట్లుగానే అధికారంలో ఉన్న ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన చేశారు…
అదే రీతిలో 2014లో కూడా చేశారు. కానీ ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లో జగన్ కే పట్టం కట్టారు… దీంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండిపోయారు… ఇక 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు మరో ప్లాన్ వేస్తున్నారట. అందుకోసం సుమారు 50 కోట్లు ఖర్చు చేయనున్నారట…
ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉండి ఆ పార్టీని గెలిపించారు… అందుకే టీడీపీ తరపున ఒక వ్యక్తిని పెట్టుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట… ప్రశాంత్ కిషోర్ కాకుండా ఆయన టీమ్ లో పని చేసిన రాబిన్ శర్మను ఎన్నికల వ్యూహకర్తగా తీసుకోవాలని చూస్తున్నారట..
ఆమేరకు సంప్రదింపులు కూడా జరిగాయట.. బేరం 50 కోట్లు ఈ అక్టోబర్ నుంచి పని మొదలు పెట్టి తమకు రాజకీయ సలహాదారుడుగా తమ వెంట ఉండాలని చంద్రబాబు సూచించారట… పార్టీని గెలిపించే బాధ్యతలను తీసుకుంటే మొత్తం ఇస్తానని బేరం పెట్టారట…