టీడీపీలో ముగ్గురికి ప్రమోషన్ ఇచ్చిన చంద్రబాబు

టీడీపీలో ముగ్గురికి ప్రమోషన్ ఇచ్చిన చంద్రబాబు

0
93

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్లు ఇచ్చారు… దీంతో ఇకనుంచి టీడీపీ పొలిటికల్ బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి ఈ మేరకు ఒక ప్రకటన కూడా తెలిపారు…

పార్టీ సీనియర్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అలాగే ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యలను పొలిట్ బ్యూరోలో చోటు కల్పించనున్నట్లు పేర్కొంది… ఈ రోజు గుంటూరు పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం కానుంది…

ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది… సమావేశం అయ్యే ముందు కోడేల అలాగే కచ్చులూరు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపనున్నారు…