వైసీపీకి షాక్…. మరో పోరాటానికి సిద్దమైన చంద్రబాబు…

వైసీపీకి షాక్.... మరో పోరాటానికి సిద్దమైన చంద్రబాబు...

0
91

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో పోరాటానికి సిద్దమయ్యారు… ప్రభుత్వ వైఫల్యాలను వివరించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది…

ఈమేరకు ఒక ప్రకటన కూడా పార్టీ కార్యాలాయంనుంచి విడుదల చేశారు… ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ప్రజాచైతన్య యాత్ర చేపట్టాలని తెలిపింది… ఈ ప్రజా చైతన్య యాత్రను అన్ని నియోజకవర్గాల్లో చేయాలని తెలిపారు….

ఈ యాత్రలో ప్రతీ ఒక్క ఎమ్మెల్యే, ఇంచార్జ్ లు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పేర్కొంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈనెల 19న ప్రకాశం జిల్లా మార్టూరులో నిర్వహించబోమే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటారు… ఈ యాత్రలో ప్రజలకు ఆయన ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు…